సీఎం పుట్టినరోజున నగర వ్యాప్తంగా హరితహారం: మేయర్‌ బొంతు రామ్మోహన్‌


 ఫిబ్రవరి 17వ తేదీన ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావు పుట్టినరోజు అన్న విషయం తెలిసిందే. సీఎం పుట్టిన రోజు సందర్భంగా నగరంలో భారీ ఎత్తున మొక్కలు నాటి, సీఎంకు పుట్టినరోజు కానుక ఇవ్వాలని నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పిలుపునిచ్చారు. నగరంలోని అన్ని వార్డుల్లో కార్పోరేటర్లు పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని మేయర్‌ తెలిపారు. సీఎం పుట్టిన రోజు సందర్భంగా నగరవ్యాప్తంగా 2.5 లక్షల మొక్కలు నాటేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మేయర్‌ పేర్కొన్నారు. అందుకు తగ్గట్లు మొక్కల పంపిణీకి అన్ని విధాలుగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈ సందర్భంగా మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. మొక్కలు నాటడమే కాదు.. వాటి పరిరక్షణ బాధ్యతలు కూడా తీసుకోవాలని ఆయన అన్నారు. నాటిన ప్రతి మొక్కను బతికించేందుకు చర్యలు తీసుకున్నప్పుడే సీఎం పుట్టిన రోజు కానుకకు సార్థకత చేకూరుతుందని  ఈ సందర్భంగా మేయర్‌ రామ్మోహన్‌.. కార్పోరేటర్లకు సూచించారు.