దేశవ్యాప్తంగా కరోనా వైరస్(కోవిద్-19) ప్రభావం తీవ్రమవుతుండడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనావైరస్‌పై ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి.. విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష అనంతరం.. సీఎం మీడియాతో మాట్లాడారు. గురువారం(రేపు) నుంచి మార్చి 31 వరకు రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, కోచింగ్ సెంటర్లకు సెలవులు ప్రకటిస్తున్నట్లు సీఎం తెలియజేశారు. ఒకేచోట ఎక్కువ మంది జనం గుమిగూడకూడదనీ, ప్రజలంతా కరోనాపై అప్రమత్తంగా ఉండాలని సీఎం ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. వైద్యుల సూచనల మేరకు పలు జాగ్రత్తలు పాటిస్తే.. కరోనా వైరస్‌ను దరిచేయనీయకుండా చేయొచ్చని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.