కరోనా వ్యాప్తి నేపథ్యంలో భారతీయ ఆర్మీ అన్ని కమాండ్ సెంటర్లకు ఆదేశాలు జారీ చేసింది. యుద్ధ విన్యాసాలు, సమావేశాలను రద్దు చేయాలని ఇండియన్ ఆర్మీ కోరింది. శిక్షణా కార్యక్రమాలను కూడా వాయిదా వేసుకోవాలని సూచించింది. అయితే పరిస్థితి మెరుగుపడే వరకు అవసరమైన వారికి మాత్రమే లీవ్‌లు ఇవ్వాలని ఆర్మీ ఓ ప్రకటనలో చెప్పింది. జలుబు, దగ్గు, జ్వరం ఉన్న సైనికులు సమీప మిలిటరీ హాస్పటల్‌కు వెళ్లాలని సూచించింది. లేహ్‌కు చెందిన ఓ జవానుకు కరోనా పాజిటివ్ తేలింది. ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి ఒకటవ తేదీ వరకు లీవ్‌లో ఉన్న ఆ జవాను 2వ తేదీన విధుల్లో చేరాడు. అతని తండ్రి ఇరాన్ నుంచి యాత్ర ముగించుకుని వచ్చాడు. బహుశా అతని తండ్రి నుంచి వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు.
యుద్ధ విన్యాసాలు రద్దు చేసిన భారత ఆర్మీ