సిఎం స‌హాయ నిధికి గంగ‌పుత్ర సొసైటీ రూ. లక్ష విరాళం


రాష్ట్ర ముఖ్యమంత్రి స‌హాయ నిధికి ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన ది వ‌రంగ‌ల్ డిస్ట్రిక్ట్ గంగ‌పుత్ర (బెస్త‌) మ్యూచువ‌ల్లీ ఎయిడెడ్ కో ఆప‌రేటివ్ హౌసింగ్ సొసైటీ రూ.ల‌క్ష విరాళం ప్ర‌క‌టించింది. ఈ మొత్తానికి చెక్కును ఆ సంస్థ బాధ్యులు రాష్ట్ర  మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుకు అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా డి.రాజ‌లింగం మాట్లాడుతూ, సిఎం రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం చేస్తున్న కృషికి కొంత చేదోడు, వాదోడుగా త‌మ స‌హాయం ఉంటుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాకుండా వైరస్ ను దరిచేరనివ్వొద్దని విజ్ఞప్తి చేశారు.  ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్క‌ర్, వ‌రంగ‌ల్ అర్బ‌న్ క‌లెక్ట‌ర్ రాజీవ్ గాంధీ హ‌న్మంతు త‌దిత‌రులు పాల్గొన్నారు.